వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత మృతి

Tue,September 17, 2019 03:00 PM

హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన సంఘటన నగరంలోని ఉప్పల్‌లో చోటు చేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళితే మోనికా అనే మహిళ తొమ్మిది నెలలు నిండటంతో ఉప్పల్ లోని మాతృప్రియ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు సాధారణ ప్రసవం అయ్యే ఛాన్స్ లేని, సిజేరియన్ చేయాలని చెప్పడంతో అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. డాక్టర్లు రాత్రి ఆపరేషన్ చేసి ఇద్దరు కవల పిల్లలకు పురుడు పోశారు. అయితే ఆపరేషన్ నిర్లక్ష్యంగా చేయడంతో అధిక రక్తస్రావంతో మోనికా చనిపోయింది. ఆమెకు ఇది రెండో కాన్పు. అంతకు ముందు ఒక కొడుకు ఉన్నాడు. మోనిక మృతితో ముగ్గురు తల్లి లేని పిల్లలయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles