చెన్నై వాసికి చెందిన 50 వేల యూరోలు మాయం

Mon,March 25, 2019 07:04 AM

chennai man bag missed in secunderabad which has 50 thousand euros

హైదరాబాద్: చెన్నై వాసికి చెందిన రూ.40 లక్షల విలువైన యూరో కరెన్సీని సికింద్రాబాద్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. చెన్నైకి చెందిన మహ్మద్ మురాద్, తన సోదరుడు మీరాన్ ముక్తర్‌తో కలిసి చెన్నైలోని సుంగంబక్కం ప్రాంతంలో మాబ్‌మనీ చేంజర్ ప్రైవేట్‌లిమిటెడ్ పేరుతో మనీ ఎక్స్చేంజ్ సంస్థను నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీని తమ సంస్థ ద్వారా మార్పు చేస్తున్నారు. అయితే మనీ ఎక్చేంజ్‌కు చెన్నై కంటే హైదరాబాద్ మార్కెట్ అనువుగా ఉన్నట్లు మురాద్ సోదరులు గుర్తించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు వచ్చి శివం రోడ్డులో ఉన్న జైన్ ఫారెక్స్ సంస్థ వద్ద కరెన్సీని మార్చుకొని వెళ్లేవాడు.

ఈ క్రమంలోనే గురువారం మురాద్ చెన్నై నుంచి హైదరాబాద్‌కు యూరో కరెన్సీని మార్చుకోవడం కోసం వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు దిగిన మురాద్, అక్కడి నుంచి నల్లకుంట శివంరోడ్డులోని జైన్ ఫారెక్స్ సెంటర్‌కు వెళ్లాడు. అయితే గురువారం హోలీ కావడంతో దుకాణం బంద్ ఉండగా తిరిగి చెన్నైకి వెళ్లాలని భావించాడు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరాడు. అయితే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రార్ధన మందిరం వద్ద కుర్చీలో బ్యాగ్ పెట్టి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ బ్యాగ్ కన్పించలేదు. దీంతో ఆందోళనకు గురైన మురాద్ ఆ బ్యాగ్‌లో 50 వేల యూరో(రూ 40 లక్షలు)లతో పాటు రూ.2 వేల నగదు, ఇతర పత్రాలు ఉన్నాయంటూ గోపాలపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో గోపాలపురం పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

1018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles