ఇంటి స్థలం(ప్లాటు) కొనుగోలు చేసేముందు..

Sun,February 24, 2019 07:02 AM

హైదరాబాద్: కష్టపడి సంపాదించిన డబ్బుతో స్థిరాస్తి కొనుగోలు చేసి.. ఆ పై చిక్కులు తెచ్చుకుంటే.. ఆ బాధ చెప్పలేనిది. ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్లు కొనే ముందు అన్ని వివరాలు సమగ్రంగా పరిశీలించుకోవాలి. అన్ని సక్రమంగా ఉంటేనే ఆస్తులు కొనుగోలు చేయాలి. లేకుంటే సంపాదించిన డబ్బులు వృథా అవుతాయి. ప్లాట్ కొనేముందు అది ఈ దిగువ నియమావళి ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
- ఓపెన్ ప్లాటు జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ/డీటీసీపీ ద్వారా అనుమతించిన లేఅవుట్‌లోనే కొనుగోలు చేయడం ఉత్తమం
- లేకుంటే క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్) చేసి ఉండాలి
- ప్లాటు పైన పేర్కొన్న సంస్థల అప్రూవ్డ్ లేఅవుట్‌ది కాకుంటే, 28-10-2015కు ముందు, అంటే ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీకు ముందు లింకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి
- టైటిల్ డీడ్ క్లియరా, కాదా అనేది ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో సరిచూసుకోవాలి
- ప్లాటు ప్రభుత్వ, సీలింగ్, చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్, రైల్వే లైన్లు, నాలాలు, చెరువుల బఫర్‌జోన్ తదితర వాటి పరిథిలో ఉన్నాయేమో సరిచూసుకోవాలి. ఒకవేళ వాటి పరిథిలో ఉంటే నిర్మాణ అనుమతులు రావు
- అంతేకాదు, లేఅవుట్ ఓపెన్ ప్లేస్, పార్కులకు వదిలిన స్థలాల్లో ఉన్నదీ, లేనిదీ చూసుకోవాలి. ఒకవేళ అటువంటి జాగాల్లో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు.

6310
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles