ట్రేడింగ్‌లో లాభాలంటూ మోసం

Tue,June 19, 2018 09:08 AM

cheating on trading investments

హైదరాబాద్ : స్వల్ప వ్యవధిలో భారీ లాభాలంటూ సామా న్య ప్రజలను నట్టేట ముంచుతున్న మోసగాళ్లపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నజర్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రేడింగ్ వ్యవహారంలో మధ్య వర్తులను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారి ఫిర్యాదులు పెరగడం తో సైబరాబాద్ సైబర్ క్రైం అధికారులు ఈ మోసాలకు పాల్పడుతున్న నిందితుల గాలింపులో మునిగిపోయారు. దీంట్లో భాగంగా ఈ తరహా మోసా లకు పాల్పడుతూ భారీ లాభాలంటూ లక్షలు కొల్లగొట్టిన నాలుగు ము ఠాల ను ముంభైలో ఉన్నట్లు సైబర్ క్రైం ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేప థ్యంలో వారిని పట్టుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు ముంభైలోని వారి అడ్డాలో తిష్ట వేసినట్లు తెలిసింది.

ఇప్పటికే పలువరు అనుమానితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకునే చర్యలో పోలీసులు ముంభై వీధు ల్లో మాటు వేశారు. ఈ ముఠా ట్రేడింగ్ స్వల్ప రోజుల్లోనే భారీగా లాభాల ఆశను పుట్టించి పెట్టుబడులను లక్షల్లో డిపాజిట్ చేయిచుకుని ఆ తర్వాత చేతులు ఎత్తేసినట్లు సమాచారం. అయితే ఈ ముఠాల వ్యవహరాలపై పూర్తి ఆధా రాలు సేకరించిన పోలీసులు వారిని అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ ముఠాలను పట్టుకుని నగరానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ముఠా నేర ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఫోన్ నెంబర్లు, మెసేజ్‌లకు సంబంధించిన పత్రాలను పోలీసులు సేకరించారు.

ఈ ముఠా సభ్యులు ట్రేడింగ్ ఖాతాదారులను ఆక ర్షించేందుకు ముందుగా స్వల్ప డిపాజిట్‌లను చేయించుకుని ఆ తర్వాత పెట్టు బడులను పెంచే విధంగా మాటలతో బురిడి కొట్టిస్తున్నట్లు తెలిసింది. ఈ ము ఠాలను అరెస్టు చేసిన తర్వాత వీరి నేరప్రక్రియకు సంబంధించి మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అంటు న్నారు. అప్పటి వరకు ఈ ముఠాలకు సంబంధించిన దర్యాప్తులో వివరాలను గోప్యంగా ఉంటాయని పోలీసులు వివరిస్తున్నారు. నేరాలకు పాల్పడిన ఈ నాలుగు ముఠాలు దాదాపు 50 లక్షలకు పైనే ముంచేశారని తెలుస్తోంది.

777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles