యజమాని ఇంటికే కన్నం

Sat,January 12, 2019 07:44 AM

car driver theft money in car owner house in hyderabad

కారు డ్రైవర్ అరెస్ట్.. 45 లక్షల చోరీ సొత్తు రికవరీ
హైదరాబాద్: 23 ఏండ్లుగా యజమాని ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ.. రూ.45 లక్షలను దొంగిలించిన కారు డ్రైవర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రాంబాబు కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా మీర్‌దొడ్డి ప్రాంతానికి చెందిన కుంట బాల్‌రాజ్(43) నగరానికి వలసవచ్చి కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతంలోని రాఘవేంద్రకాలనీలో నివాసం ఉంటున్నాడు.

రాయదుర్గం విస్పర్‌వ్యాలీ కాలనీలో నివాసం ఉండే అనుమూరి కృష్ణప్రసాద్ అనే వ్యాపారి వద్ద 23 సంవత్సరాలుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. బాల్‌రాజ్ రాఘవేంద్రకాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ నేపథ్యంలో డబ్బులు అవసరం ఉండడంతో యజమాని ఇంట్లో ఉన్న డబ్బులపై కన్నేశాడు. ఈనెల 4న రూ.25 లక్షలు, 8న రూ.20 లక్షల నగదును దొంగలించాడు. గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు డ్రైవర్ బాల్‌రాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.45 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

1337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles