కీమో థెరపీ లేకుండానే క్యాన్సర్‌ను జయించవచ్చు

Fri,February 9, 2018 07:16 AM

Cancer can be cured without chemotherapy

హైదరాబాద్: క్యాన్సర్ చికిత్స అనగానే.. మనకు గుర్తుకొచ్చేది కీమో థెరపీ. అయితే వివిధ రకాల క్యాన్సర్లకు అన్ని దశల్లోనూ ఈ విధానం లేకుండానే వ్యాధి నియంత్రించవచ్చంటున్నారు ఎంఎన్‌జే వైద్యులు. కొన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా దశల వారీగా మాత్రలు అందిస్తూ వ్యాధిని నియంత్రించవచ్చని ఎంఎన్‌జే క్లీనికల్ అంకాలజిస్టు డా.సాయిరామ్ తెలిపారు. అయితే అడ్వాన్స్‌డ్ లంగ్ క్యాన్సర్(చివరి దశ)వ్యాధులను సైతం ఈ మాత్రలతో అరికట్టవచ్చని చెప్పారు. క్యాన్సర్ వ్యాధుల నివారణపై నిరంతరం జరిగే పరిశోధనల ఆధారంగా ప్రతి సంవత్సరం దేశంలోని ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు చికిత్సా విధానాలపై జారీ చేసే మార్గదర్శకాల్లో భాగంగా నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు చెందిన క్లినికల్ అంకాలజిస్టు డా.సాయిరామ్ రూపొందించిన మార్గదర్శకాలను ఇండియన్ క్యాన్సర్ జర్నల్-2018లో ప్రచురించారు.డాక్టర్ సాయిరామ్ సూచించిన మార్గదర్శకాలు..
-సాధారణంగా రోగి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమిక దశలో తెలియగానే మొదట అతడికి జనరల్ బయాప్సీ పరీక్ష చేయాలి. దీని ద్వారా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా తెలిసిపోతుంది.
-ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే రోగికి జనరల్ బయాప్సీ నిర్వహిస్తే సరిపోతుంది. అనంతరం స్పెక్టికల్ టెస్ట్ లేదా అడినోకారిమంబ లంగ్ క్యాన్సర్ టెస్ట్ చేయాలి. ఈ పరీక్షల ద్వారా రోగి ఏ రకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడో తెలిసిపోతుంది.
-రోగి ఓవర్ ఎక్స్‌పెన్సివ్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తేలితే రోగికి జెఫ్ట్‌నిబ్-250ఎంజీట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
-రోగి ఆల్కో ఓవర్ ఎక్స్‌పెన్సీవ్ ట్యూమర్ లేదా రోజ్-1 ఓవర్ ఎక్స్‌పెన్సీవ్ ట్యూమర్‌తో ఉంటే జెఫ్ట్‌నిబ్ లేదా క్రిజోటినిబ్ మాత్రలను అందిస్తూ చికిత్స చేయవచ్చు. రోగికి మాత్రలు అందిస్తూనే మధ్య మధ్యలో ఫాలోఅప్ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బోన్స్ స్కాన్, బ్రెయిన్‌కు ఎంఆర్‌ఐ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
-సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి ఎముకలు, మెదడుకు వ్యాపిస్తుంది. వ్యాధి నియంత్రణకు వాడే జెఫ్ట్‌నిబ్ తదితర మాత్రలు మెదడుపైగాని, ఎముకలపైగాని పనిచేయవు. దీనిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సంవత్సరంలో ఒకసారి బోన్‌స్కాన్ చేయాలి, దీని వల్ల ఎముకల స్థితి తెలిసిపోతుంది.
-ఎముకలు బలహీనపడుతున్నట్లు తేలితే వెంటనే జోలిడోనిక్ ఆసిడ్ లేదా ఐ-బోన్‌డోలిక్ ఆసిడ్ మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల ఎముకలు క్యాన్సర్ బారినుంచి సంరక్షించవచ్చు.
-బ్రెయిన్‌కు ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్షలో క్యాన్సర్ వ్యాధి మెదడుకు చేరుకున్నట్లు తేలితే బ్రెయిన్‌కు కీమో థెరపీ అందించాల్సి ఉంటుంది.

ఎంఎన్‌జేలో అంతా ఉచితమే....

ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన వైద్యపరీక్షలుగాని, మందులుగాని చాలా ఖరీదైనవి. ఏడాదికి సుమారు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత ఖరీదైన వైద్యాన్ని ఎంఎన్‌జే దవాఖానలో ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థల సహకారంతో పూర్తి ఉచితంగా అందింస్తున్నాం. చాలా మంది రోగులు ప్రైవేటు దవాఖానలకు తిరిగి అక్కడ ఉన్న డబ్బులన్నీ ఖర్చుచేసుకుని, రోగం ముదిరిన దశలో సర్కార్ దవాఖానలకు పరుగులు తీస్తారు. కార్పొరేట్‌కు ధీటుగా ఎంఎన్‌జేలో వైద్యసౌకర్యాలు, ఖరీదైన మందులు అందిస్తున్న విషయాన్ని రోగులు గుర్తిస్తే మంచిది. దీనివల్ల అటు ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు ఆర్ధిక సమస్యలు తలెత్తవు.
-డా.సాయిరామ్(క్లినికల్ అంకాలజిస్టు, ఎంఎన్‌జే దవాఖాన)

2143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles