దొంగతనం కేసులో క్యాబ్‌డ్రైవర్ అరెస్టు

Thu,November 15, 2018 08:26 AM

cab driver arrested in theft case Hyderabad

హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొంది ఒంటరిగా అర్ధరాత్రి క్యాబ్‌లో వస్తున్న మహిళను చితకబాది దోచుకున్న క్యాబ్ డ్రైవర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం...బోడుప్పల్‌కు చెందిన పిల్లి సువర్ణాదేవి అనారోగ్యంగా ఉండడంతో రాత్రి ముషీరాబాద్ కేర్ దవాఖానలో డయాలిసిస్ చేయించుకొని క్యాబ్‌లో బోడుప్పల్‌కు బయలుదేరింది. నాచారం ఎక్స్‌రోడ్డు వద్ద డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి కారు ఆపి సువర్ణాదేవిని కిందకు లాగి చితకబాది రూ.3 వేల నగదు, మొబైల్ ఫోన్, బ్యాగు తీసుకొని పరారయ్యాడు. దీంతో బాధితురాలు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేయగా మల్లాపూర్ బాబా కేఫ్ వద్ద చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి కారు, మొబైల్ ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు.

మై క్యాబ్ ఈజ్ సేఫ్ ఉన్న స్టికర్ కారులో ప్రయాణించండి : సీపీ మహేష్‌భగవత్


ఒంటరిగా ప్రయాణీంచే మహిళలు కారుకు మై వెహికిల్ లేదా మై క్యాబ్ ఈజ్ సేఫ్ క్యూఆర్ కోడ్ స్టికర్‌తో ఉన్న వాటిలోనే ప్రయాణించాలి. క్యూ ఆర్ కోడ్ యాప్ ద్వారా స్టికర్‌పై ఉన్న కోడ్‌ను స్కాన్ చేస్తే కారు డ్రైవర్‌తో పాటు యజమాని, వాహనానికి సంబంధించిన వివరాలు వస్తాయి. వాటిని కుటుంబసభ్యులకు, స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించుకోవాలి. లేదా క్యాబ్ ఎక్కే ముందు నెంబరను ఫొటోతీసుకుని కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాలి. దీనిద్వారా ఏదైనా గందరగోళం జరిగే అవకాశం ఉన్నా, జరిగినా నిందితులను పట్టుకునేందుకు సులభంగా ఉంటుంది. అదే విధంగా దారి తప్పిన క్యాబ్ ఆచూకీని కనుకునేందుకు ఈ ప్రక్రియ వేగంగా ఉపయోగపడుతుంది. ఈనేరానికి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని ఆర్‌టీఏ అధికారులకు లేఖలు రాస్తాం. అదే విధంగా అతనిపై రౌడీషీట్ నమోదు చేస్తాం.

647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles