మనసులో మాట.. మీ ముంగిట

Wed,October 26, 2016 06:55 AM

Broadcast wearable Music T-shirts

హైదరాబాద్: నిత్య జీవితంలో దుస్తులు.. తప్పని సరి అవసరం. ఆఫీస్, స్కూల్, పార్టీ ఇలా.. సందర్భాన్ని బట్టి స్టైల్ మారుతుందంతే. కానీ సాధారణంగా టీషర్ట్, జీన్స్ ప్రతి ఒక్కరూ వినియోగిస్తుంటారు. అలాంటి టీషర్ట్స్ మీకు నచ్చిన డిజైన్‌లో దొరికితే.. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని కల్పిస్తోంది బ్రాడ్‌కాస్ట్ వేరబుల్. ప్రపంచంలోనే తొలిసారి ఎల్‌ఈడీ ప్యానెల్‌తో టీషర్ట్‌ని ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. త్వరలోనే తన ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేయనుంది. గత నవంబర్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యప్ప నాగుబండి తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చేందుకు ఎంతోమంది సహకారం తీసుకున్నారు. డిజైన్ ఫైనలైజేషన్, మ్యానుఫాక్చరింగ్ అసెంబ్లీ సెటప్, డిస్ట్రిబ్యూషన్ సెటప్ పూర్తి చేసుకున్న బ్రాడ్‌కాస్ట్ వేరబుల్ వచ్చే నెలలో మార్కెట్‌లోకి రానుంది.

నచ్చిన డిజైన్
ఎల్‌ఈడీ పానెల్ గల ఈ టీషర్ట్స్‌ని స్మార్ట్ ఫోన్‌కి బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా టీ షర్ట్‌పై మీకు నచ్చిన డిజైన్స్, లోగోలు, సందేశాలను ప్రదర్శించుకోవచ్చు. మీకు నచ్చిన సందేశాన్ని మెరిసే అక్షరాల్లో మీ షర్ట్‌పై వచ్చేల చేసుకోవచ్చు. లేదా... మీ స్వంత పేరునో, మీ సంస్థ లోగోనో డిస్లే చేసుకోవచ్చు. మీరు పార్టీకి వెళ్లేటప్పుడు, ఫ్రెండ్స్‌తో గడిపేటప్పుడు సందర్భాన్ని బట్టి ఇమేజ్‌ని మార్చుకోవచ్చు.

ఎల్‌ఈడీ ప్యానెల్
కేవలం డిజైన్‌ని మార్చుకునే అవకాశమే కాదు.. ప్యానెల్‌ని స్వైప్ చేస్తూ గ్యాలరీలో ఉన్న డిజైన్స్ నుంచి కావలసిన దానిని ఎంచుకోవచ్చు. టీషర్ట్‌లో సర్‌ఫేస్డ్ మౌంటెన్ డివైస్ ఎల్‌ఈడీలను ఒక సర్క్యుట్‌లో యూజ్ చేయడం వల్ల ఎలాంటి డిజైన్ అయినా ఎంపిక చేసుకోవచ్చు. ఎల్‌ఈడీని బ్యాటరీకి అనుసంధానం చేసే సన్నని తీగలు కూడా టీషర్ట్‌లో ఉంటాయి. ఈ ప్యానెల్ ఇంచుమించు ఏ4 సైజులో ఉంటుంది. XS, S, M, L, XL, XXL, XXXL & XXXXL సైజుల్లో మహిళలు, పిల్లలు, పురుషుల కోసం టీషర్ట్స్‌ని అందించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని బ్రాడ్‌కాస్ట్ వేరబుల్స్ కో ఫౌండర్ మహాలక్ష్మి తెలిపారు. డిసెంబర్ నాటికి మార్కెట్‌లోకి ఈ టీషర్ట్స్‌ని విడుదల చేస్తామంటున్నారు మహాలక్ష్మి. మీరూ ఎల్‌ఈడీ టీషర్ట్ ఆర్డర్ చేయాలంటే www.broadcastwear.com వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి.

కొత్త అనుభూతి: - మహాలక్ష్మి, బ్రాడ్‌కాస్ట్ వేరబుల్స్ కో ఫౌండర్
ఫ్యాషన్ రంగంలో కొత్తదనాన్ని పరిచయం చేయడమే మా లక్ష్యం. రెగ్యులర్ టీ షర్ట్స్‌ని సైతం సరికొత్తగా చూపించాలనుకున్నాం. మనకు నచ్చిన డిజైన్‌ని, మనకు నచ్చిన సందేశాన్ని టీషర్ట్స్ చూసుకోవడం కొత్త అనుభూతిని అందిస్తుంది. అందుకోసం టీషర్ట్‌లో ఎల్‌ఈడీ ప్యానెల్‌ని యూస్ చేయాలనుకున్నాం. కానీ ఎల్‌ఈడీని సెట్ చేయడానికి మా టీం ఎంతో కృషి చేసింది. ప్రస్తుతం మేము మహిళల కోసం ప్రత్యేకంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీషర్ట్స్‌ని సిద్ధం చేశాం. వాటిని ట్రై చేసిన పలువురు సంతృప్తిని వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి మార్కెట్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం.1060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles