మరణిస్తూ.. జీవించాడు..!

Sat,January 12, 2019 06:19 AM

brain dead man family members accepted to donate his organs in hyderabad

హైదరాబాద్: తాను మరణించినా అవయవదానం ద్వారా జీవించాడు. మల్కాజిగిరిలోని వసంతగిరి కాలనీకి చెందిన సిరిసిల్ల ఎమాన్యూల్(33) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య షీబా రాణి, కుమారుడు సిరిల్ జెస్సీ (తొమ్మిది నెలలు) ఉన్నారు. ఎమాన్యూల్ ఈ నెల 3వ తేదీన ఆఫీసు నుంచి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో కుక్క అడ్డుగా వచ్చింది. దీంతో బైకు అదుపుతప్పి కింద పడిపోయాడు.

ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా, చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చేర్పించారు. చికిత్స నిర్వహించిన వైద్యులు ఈనెల 9న బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు బాధితుడి అవయదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. మరణించినా అవయవదానంతో జీవించే అవకాశం ఉందని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించగా, అందుకు వారు అంగీకరించారు. దీంతో ఎమాన్యూల్ నుంచి కాలేయం, గుండె, రెండు మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, కండ్లను సేకరించారు.

2764
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles