టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటూ కోట్లు దండుకుంటున్నారు!

Tue,January 22, 2019 01:16 PM

BJP leaders meets Governer ESL Narasimhan

హైదరాబాద్: బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి ఇవాళ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు లక్ష్మణ్ తెలిపారు. పవిత్ర టీటీడీలో టికెట్ల అమ్మకాలలో అక్రమాలకు పాల్పడటం.. బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం దారుణమైన విషయమని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటూ కోట్లు దండుకుంటున్నారు. జేఈవోకు అధికారం ఇచ్చి తన గుప్పెట్లో ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు.

2456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles