టీఆర్‌ఎస్‌లో చేరిన 350 మంది బీజేపీ కార్యకర్తలు

Fri,September 14, 2018 04:47 PM

BJP leaders joins TRS in presence of KTR

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించామని వెల్లడించారు. గోదావరి నీళ్లతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కరవును పారదోలడానికి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా కేసులు వేశారు. రాష్ట్ర అభివృద్ధి ఆగకూడదని ఎన్నికలకు వెళ్తున్నాం. ఎవరూ అధికారం వదులుకుని ముందకు వెళ్లరు.. కానీ మేం వెళ్తున్నామని చెప్పారు.ముదిగొండ, బషీర్‌బాగ్ కాల్పులకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి గడ్డుకాలమే అని వివరించారు. కామారెడ్డిలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు రావాలని.. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తోంది. తెలంగాణ ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు పదవులు అనుభవించారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని, పథాన్ని ఆపుతున్నందుకే ప్రజల తీర్పు కోరుతున్నాం.
ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ వణుకుతోంది. గత పాలనలో ప్రజలను దోచుకున్న తోడుదొంగలు ఒకటవుతున్నారు. దొంగ పనులు చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వారు లేరు. ప్రగతి నిరోధకులు కావాలో.. ప్రగతి సాధకులు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతకుముందు కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన నలుగురు బీజేపీ కౌన్సిలర్లు, 350 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్థన్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.


3794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS