టికెట్ ఎవరికిచ్చిన కలిసి పనిచేస్తాం: దానం

Fri,November 9, 2018 12:34 PM

bjp activists joining in trs party

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్‌ఎస్ నాయకుడు దానం నాగేందర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎ కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పదవి ఆశించి టీఆర్‌ఎస్ పార్టీలో చేరలేదని, పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రం ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలను టీఆర్‌ఎస్ వైపు ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

3840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS