రేపటి కోసం నేడు.. థీమ్‌తో ‘బయోఆసియా-2020’ సదస్సు

Wed,October 16, 2019 06:39 PM

హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో ‘బయో ఆసియా-2020’ సదస్సు జరుగనున్నది. హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి కోసం నేడు అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగనుంది. ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌.. సదస్సుకు సంబంధించిన వెబ్‌సైట్‌, లోగో, థీమ్‌ను విడుదల చేశారు. ఇది 17వ బయోఆసియా సదస్సు కావడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అంతర్జాతీయ సదస్సులకు వేదికవడం సంతోషదాయకమని అన్నారు. గతంలోనూ చాలా అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్‌ వేదికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, బయో ఆసియా సీఈవో శక్తినాగప్పన్‌, తదితరులు పాల్గొన్నారు.483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles