‘బతుకమ్మ రైడ్’.. ఇది వినూత్న రోడ్‌షో!

Tue,October 9, 2018 05:07 PM

Biking for nine days of Bathukamma to promote womens safety in Telangana

హైదరాబాద్: షీటీమ్స్, తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు 9 మంది మహిళలతో 9 జిల్లాలలో పర్యటించే బతుకమ్మ రైడ్ ఇవాళ ప్రారంభమైంది. బైక్‌రైడ్‌లో పాల్గొనేవారంతా మహిళే. ప్రధానంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, బతుకమ్మ విశిష్ఠతను చాటి చెప్పేందుకు ద్విచక్రవాహనాలపై పర్యటన ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్‌లో మొదలైన యాత్ర అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది.

షీ టీమ్స్, టూరిజం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి హైదరాబాద్ బైకర్నీ గ్రూప్ వినూత్న రోడ్‌షో చేపట్టింది. 2013లో మొదలైన గ్రూప్ మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా తొమ్మిది ప్రధాన జిల్లాలో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో తొమ్మిది మంది మహిళా రైడర్లు పాల్గొననున్నారు. రైడర్లంతా చేనేత దుస్తుల ధరించి రోడ్‌షోలో పాల్గొంటారని, దీనికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడూ సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తామని గ్రూప్‌కు నేతృత్వంవహిస్తున్న విమెన్ రైడర్ జయ భారతి తెలిపారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో నిర్వహించే ఈవెంట్లలో బైకర్నీలు పాల్గొంటారు. బతుకమ్మ చివరి రోజున హైదరాబాద్‌లో ఫ్యాషన్ షో నిర్వహిస్తామని భారతి చెప్పారు.

3103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles