రేపు ఓయూలో భాగ్యరెడ్డి వర్మ స్మారక ఉపన్యాసం

Tue,May 21, 2019 09:05 PM

Bhagya Reddy Verma Memorial Lecture in Osmania University tomorrow

హైదరాబాద్: తెలంగాణ వైతాళికుడు, దళిత ఉద్యమ ధృవతార మాదరి భాగ్యరెడ్డి వర్మ 131వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని స్మారక ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల లింగస్వామి తెలిపారు. ఓయూ మెయిన్ లైబ్రెరీ బిల్డింగ్‌లోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ సెమినార్ హాల్‌లో ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వక్తగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరవుతారని చెప్పారు. ఇటీవల పదవీ విరమణ పొందిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ మల్లేశంను ఈ సందర్భంగా ఆత్మీయ సన్మానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles