అలరించనున్న బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్

Tue,November 19, 2019 06:49 AM

హైదరాబాద్ : తెలంగాణ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్‌తో నగరంలో సుహృద్భావ వాతావరణం వెల్లివిరుస్తుందని, భాషా, సాంస్కృతిక వైవిధ్యం ఏర్పడుతుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్, సీజన్-3కి సంబంధించిన మీడియా సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం సోమాజిగూడలోని ది పార్కు హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ మాట్లాడారు. బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్‌ను డిసెంబర్ 6, 7, 8వ తేదీల్లో ఎల్వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్‌కు వివిధ ప్రాంతాల నుంచి సినిమా రంగానికి చెందిన మహోన్నతులు వస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమైన సినిమాలు ప్రదర్శించబడుతాయని తెలిపారు. రవీంద్రభారతిలో కూడా ఒకరోజు సినిమా వేడుకను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భారతీయ రంగస్థల నిఫుణులు, పద్మశ్రీ మహ్మద్ అలీ బేగ్ సారథ్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. పద్మశ్రీ మహ్మద్ అలీ బేగ్ మాట్లాడుతూ 10 ఫీచర్ ఫిల్మ్స్, 8 లఘు చిత్రాలు, 3 విదేశీ చిత్రాలను ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ డైరెక్టర్ జయ్ కుమార్ దత్తా, టీబీఎఫ్‌ఎఫ్ కన్వీనర్, జనరల్ సెక్రటరీ సుమిత్ సేన్, తదితరులు పాల్గొన్నారు.

207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles