జీహెచ్‌ఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం

Thu,June 20, 2019 03:03 PM

BC voters identification begins under GHMC limits says Dana kishore

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. బీసీ ఓటర్ల గుర్తింపుపై ఉన్నతాధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ నేడు సమావేశం నిర్వహించారు. ఈ నెల 22 నుంచి జులై 4 వరకు బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 6న బీసీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తామన్నారు. జులై 7 నుంచి 11వ తేదీ వరకు ఓటర్ల గుర్తింపుపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు చెప్పారు. జులై 18న వార్డుల వారీగా బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. అనంతరం తుది జాబితాను మున్సిపల్ పరిపాలనశాఖ సంచాలకునికి అందజేయనున్నట్లు తెలిపారు.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles