నగరంలో 7 ల‌క్ష‌ల మందికి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణి

Wed,September 13, 2017 05:34 PM

bathukamma sarees to 7 lakh people in Hyderabad says ghmc commissioner

హైద‌రాబాద్‌: నగరంలో మొత్తం ఏడు ల‌క్ష‌ల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా. బి. జానార్దన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18, 19, 20వ తేదీల‌లో చేప‌ట్ట‌నున్న బ‌తుక‌మ్మ చీరల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను క‌మిష‌న‌ర్ ఆదేశించారు. మొత్తం 640 రేష‌న్ షాపుల ప‌రిధిలో ఆహార భ‌ద్ర‌త కార్డు ఉన్న మ‌హిళా ల‌బ్దిదారుల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆహార భ‌ద్ర‌తా క‌లిగిన మ‌హిళ‌లు త‌మ గుర్తింపుగా ఆధార్‌కార్డు లేదా ఫోటో గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని స‌మ‌ర్పించాల‌ని సూచించారు. చీర‌ల పంపిణీని ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు.

2384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS