పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే సుమన్‌ విరాళం

Tue,June 25, 2019 05:12 PM

balka suman Donated   one month salary   for the construction of TRS Party District Offices

హైద‌రాబాద్: సోమ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా 29 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య భ‌వ‌న నిర్మాణ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల‌ను మంత్రులు, జెడ్పీఛైర్మ‌న్లు, ఛైర్‌ప‌ర్స‌న్లు, పార్టీముఖ్య‌నేత‌లు పండుగ వాతావ‌ర‌ణంలో ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల‌యాల నిర్మాణానికి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ త‌న వంతు ఆర్థిక సాయం అందించారు. త‌న ఒక నెల వేత‌నం 2,50,000 రూపాయ‌ల‌ను టీఆర్ఎస్ పార్టీకి విరాళంగా అంద‌జేశారు. మంగ‌ళ‌వారం టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిసిన సుమ‌న్ ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆయ‌న‌కు అందించారు. ఈ విష‌యాన్ని సుమ‌న్ త‌న ఫేస్ అకౌంట్ ద్వారా తెలుపుతూ కేటీఆర్‌కు చెక్కు అంద‌జేస్తున్న ఫొటోల‌ను షేర్ చేశారు.

2670
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles