రవిప్రకాశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు

Fri,July 12, 2019 03:35 PM

Bail sactioned to tv9 ex ceo raviprakash

హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో రవిప్రకాశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. నకిలీ పత్రాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలందమీడియా సంస్థ రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేయగా.. సైబరాబాద్ పోలీసులు రవిప్రకాశ్ పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

గతంలో రవిప్రకాశ్‌ తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో..ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రవిప్రకాశ్‌కు ఉపశమనం కల్పించలేమన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ అంశాన్ని హైకోర్టే తేల్చాల్సి ఉందని.. అక్కడికే వెళ్లాలని రవిప్రకాశ్ కు సూచించింది.

816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles