బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారిపై నిఘా

Mon,May 6, 2019 09:39 AM

awareness programs conducted on cigarette smoking by narayanaguda police

హైదరాబాద్: సరదా కోసం మొదలైన ధూమపానం అలవాటుగా మారి చివరకు వ్యసనపరులను చేస్తోంది. సిగరెట్ తాగే వారే కాకుండా దాని వాసన పీల్చే వారు సైతం శ్వాసకోశ వ్యాధులకు గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. శక్తివంతమైన యువత మత్తు పదార్థాలకు బానిసై వారి బంగారు భవిషత్తును అంధకారం చేసుకుంటున్నారు. గుట్కా, సిగరేట్ వల్ల దవడ, శ్వాసకోశ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే విషయం తెలిసినా కొంతమంది యువతి, యువకులు స్నేహితులతో కలిసి నిత్యం సరదా ముచ్చట్లతో కాలక్షేపం చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రజా రవాణా, షాపింగ్‌మాల్స్, సినిమాహాల్స్, హోటల్స్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పొగతాగడం నిషేధం ఉన్నప్పటికీ పొగరాయుళ్లలో మార్పు రావడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారిని అదుపు చేసేందుకు గాను నారాయణగూడ పోలీసులు నడుం బిగించారు. గుట్కా, సిగరేట్ వల్ల కలిగే అనర్థాలను పాన్‌షాపుల నిర్వాహకులతో పాటు ప్రజలకుల కల్పిస్తున్నా రు.

నిబంధనలు ఉల్లఘించే వారికి మొదటిసారి అవగాహన కల్పిస్తున్నారు. తరుచూ పట్టుబడే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే చర్యలు తప్పవని హెచ్చరికలతో ముద్రించిన సూచికలను ఎస్సై సైదులు నేతృత్వంలో కింగ్ కోఠి, రాం కోఠి, షేర్‌ఘాట్, హిమాయత్‌నగర్‌లోని పాన్‌షాప్‌ల్లో ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

1393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles