ఆటోలో మరిచిపోయిన కవర్‌ను అప్పగించిన డ్రైవర్‌కు పోలీసుల అభినందనలు

Wed,June 26, 2019 01:32 PM

auto driver honestly returned bag which was left in auto in hyderabad

హైదరాబాద్: ఓ ప్రయాణికురాలు ఆటో ఎక్కి దిగేటప్పుడు ఆటోలోనే తన కవర్‌ను మరిచిపోయింది. ఆటో డ్రైవర్ నరసింహ ఆ కవర్‌ను చూసి.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కవర్‌ను పోలీసులకు అందించాడు. కవర్‌ను చెక్ చేసిన పోలీసులు.. దాంట్లో విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని గుర్తించారు. ప్రయాణికురాలు కవర్‌ను మరిచిపోయినా.. దాన్ని తీసుకెళ్లకుండా.. నిజాయితీతో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఇచ్చిన ఆటో డ్రైవర్ నరసింహను పోలీసులు అభినందించారు. ఈ ఘటన నగరంలోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.

ఆటోలో తన కవర్ మరిచిపోయానని.. ప్రయాణికురాలు కూడా అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో.. వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ ఆటో డ్రైవర్ అందించిన కవర్‌ను చూపించగా.. అది తనదేనని ఆమె చెప్పడంతో వెంటనే ఆటో డ్రైవర్‌ను పిలిపించి.. అతడి చేతనే ఆ కవర్‌ను ఆ ప్రయాణికురాలికి పోలీసులు అప్పగించారు. మరోసారి ఆటోడ్రైవర్‌ను పోలీసులంతా అభినందించడంతో పాటు.. మిగితా ఆటో డ్రైవర్లు కూడా నర్సింహను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles