అధికారులు అప్రమత్తంగా ఉండాలి: నగర మేయర్

Tue,May 21, 2019 09:23 PM

authorities should be alert says hyderabad mayor bonthu rammohan

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, జోనల్, డెప్యూటీ కమీషనర్లు అప్రమత్తంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాలు జారీచేశారు. నీటి ముంపుకు గురైన రహదారుల్లో నీటి తొలగింపు, కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని డిజాస్టర్ రిస్క్యు టీంలను మేయర్ ఆదేశించారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్నందున నగరవాసులు హోర్డింగులు, యూనిపోల్స్ సమీపంలో ప్రయాణించొద్దని కమిషనర్ దాన కిశోర్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

2812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles