HomeLATEST NEWSAttack on woman to continue friendship

స్నేహం కొనసాగించాలంటూ మహిళపై దాడి

Published: Thu,November 15, 2018 08:32 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

బంజారాహిల్స్ : తనతో స్నేహం కొనసాగించడం లేదన్న కక్షతో మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్‌లోని దుర్గాభవన్‌నగర్ బస్తీలో నివాసముంటున్న వివాహిత(25) ఆరేళ్లుగా అదే ప్రాంతంలో ఉన్న రామకృష్ణ (27)తో స్నేహంగా ఉంటోంది. వీరు తరచూ ఫోన్‌లు చేసుకోవడంతోపాటు అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. రెండునెలల క్రితం ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త నిలదీయడంతో రెండునెలల నుంచి రామకృష్ణను దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల 12న వివాహిత ఇంటికొచ్చిన రామకృష్ణ తనతో స్నేహం కొనసాగించాలంటూ జుట్టు పట్టుకొని దాడి చేశాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

1768
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology