మండపాలకు అనుమతి తప్పనిసరి : సీపీ

Wed,August 29, 2018 06:51 AM

Approval of the mandap is mandatory says hyd cp Anjani kumar

హైదరాబాద్: గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆయా పోలీస్‌స్టేషన్లలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయన్నారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన రూట్‌ను తప్పనిసరిగా దరఖాస్తు ఫారాలలో పొందుపర్చాలన్నారు. దరఖాస్తు ఫారాలను సెప్టెంబర్ 9వ తేదీ వరకు పోలీస్‌స్టేషన్లలో అందజేయాలన్నారు. సెప్టెంబర్ 13నుంచి 23వ తేదీ వరకు గణేష్ నవరాత్రులు జరుగనున్నాయని హెచ్చరించారు. పండుగను ఆసరాగా చేసుకొని అసాంఘిక శక్తులు బలవంతపు వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

1600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles