స్కాలర్‌షిప్‌లకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Sat,August 10, 2019 08:55 AM

ఈనెల 15 నుంచి మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రత్న కల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందన్నారు. సంబంధిత పాఠశాల, కళాశాల వారు httpః//scholarships. gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సంబంధిత జిరాక్స్ కాపీలు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.


ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ

ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకులకు, ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అంజినాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వనున్నారన్నారు. మెషిన్ ఆపరేటర్ - ఇంజక్షన్ మౌల్డింగ్, మెషిన్ ఆపరేటర్ - ప్లాస్టిక్స్ ఎక్స్ ట్రూషన్‌లలో 8వ తరగతి ఆపైన చదివిన వారికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7893586494 సంప్రదించాలని సూచించారు.

1491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles