పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

Fri,November 15, 2019 10:01 PM

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా విభాగంలో పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడగించినట్లు లా విభాగం హెడ్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు. ఓయూ లా కళాశాలలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ లా విభాగంలో ఆరు పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. సైబర్ లా, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లా, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్రసీ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మోడర్న్ కార్పొరేట్ లా, ఐప్లెడ్ హ్యూమన్ రైట్స్ విభాగాలలో ఒక సంవత్సరం పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కోర్సులకు రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. ఈ ప్రవేశాలను ప్రవేశపరీక్ష ద్వారా నిర్వహిస్తామన్నారు. దీనికి ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలను వచ్చే నెల 8వ తేదీన నిర్వహించి, ఫలితాలను వచ్చే నెల 11వ తేదీన నిర్వహిస్తామని వివరించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని, లేదా 040-27682368, 23231092, 8142493114 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles