ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Mon,June 17, 2019 07:31 AM

Applications invited for fashion designing course in nift hyderabad

హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులకు యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్(నిఫ్డ్) డైరెక్టర్ యు.గీత తెలిపారు. మూడేండ్ల బీఎస్సీ డిగ్రీ ఫ్యాషన్ టెక్నాలజీ, రెండు సంవత్సరాల ఇంటర్ ఫ్యాషన్ గర్నమెంట్ మేకింగ్, సంవత్సరం పాటు డిప్లొమా ఫ్యాషన్ డిజైనింగ్, 6 నెలలు, 3 నెలలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో పాటు ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్ (స్కెచ్చింగ్), సర్‌ఫేస్ ఆర్నమెంటేషన్ (ఎంబ్రాయిడరీ అండ్ పెయింటింగ్), టెక్స్‌టైల్స్ సైన్స్(డైనింగ్ అండ్ పెయింటింగ్), ఫ్యాట్రన్ మేకింగ్(ఫ్యాబ్రిక్ కటింగ్),గార్మెంట్ కన్‌స్ట్రక్చన్ (టైలరింగ్) కోర్సుల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన ఆసక్తిగల విద్యార్థినులు, మహిళలు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. వివరాలకు 9030610033/55లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

2324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles