హోట‌ళ్ల త‌నిఖీలకు యాప్ ప్రారంభం

Wed,September 13, 2017 05:22 PM

App start for hotels check in Hyderabad

హైదరాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో న‌గ‌ర‌వాసుల‌కు నాణ్య‌మైన ఆహారం, స్వ‌చ్ఛ మంచినీరు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను అందించే దిశ‌గా హోట‌ళ్ల త‌నిఖీల‌కు రూపొందించిన ప్ర‌త్యేక మొబైల్ యాప్‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి లాంఛ‌నంగా ప్రారంభించారు. హోట‌ళ్ల త‌నిఖీలో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త, జ‌వాబుదారిత‌నం ఉండాల‌నే ఉద్దేశంతో హోట‌ళ్ల త‌నిఖీకై జీహెచ్ఎంసీ రూపొందించిన మొబైల్ యాప్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ గ‌తంలోనే ప్రారంభించ‌గా కొద్దిరోజుల క్రితం జ‌రిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీలో ఆమోదించారు. మొత్తం 21 ప్ర‌శ్న‌లతో కూడిన ఈ యాప్‌లో హోట‌ళ్ల‌కు సంబంధించిన సమాచారమంతా ఉంటుంది. త‌నిఖీ నిర్వ‌హణ అధికారాలను మెడిక‌ల్ ఆఫీస‌ర్లకు ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ తెలిపారు.

1123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS