సమ్మెకు ప్రత్యామ్నయ మార్గాలు..

Mon,October 21, 2019 08:17 AM

తాత్కాలిక డ్రైవర్ల కొరత లేకుండా చర్యలు, డ్రైవర్ జీతం రోజుకు మరో రూ.260 పెంచే ఆలోచనలో ప్రభుత్వం
హైదరాబాద్: విద్యా సంస్థల సెలవులు ముగిసి ప్రారంభం కాబోతున్న సమయంలో ఆర్టీసీ బస్సులకు డ్రైవర్ల కొరత లేకుండా గ్రేటర్ హైదరాబాద్‌లోని రవాణాశాఖ జాగ్రత్త పడుతున్నది. ఇప్పటివరకు చాలా ఆర్టీసీ బస్సులను పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లతో నడిపించారు. సోమవారం నుంచి విద్యాసంస్థల డ్రైవర్లు తమ సంస్థల బస్సులు నడుపడానికి వెళ్లనుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్య లు చేపట్టింది. సమ్మెకాలంలో నగరంలో డ్రైవర్ల కొరత రాకుండా ఉండటానికి డ్రైవర్ల జీతం రూ.1500 నుంచి 1750కి పెంచారు. అయితే డ్రైవర్ల కొరత ఏర్పడనున్న నేపథ్యంలో మరో రూ.250 పెంచి రోజు డ్యూటీ చేస్తే రూ.2,000 ఇచ్చేదిశగా ప్రభు త్వం ఆలోచిస్తున్నది.


విద్యా సంస్థల బస్సులు నడుపడానికి డ్రైవర్లు వెళ్లినా కొరత రాకుండా చూడటానికి హెవీ వాహనాలు నడిపిన గూడ్స్ వాహనాల డ్రైవర్లను రంగంలోకి దించనున్నారు. అవసరమైతే పక్క రాష్ర్టాల నుంచి కూడా డ్రైవర్లను తెప్పించాలని చూస్తున్నారు. ముందుగా డ్రైవింగ్‌ను అన్ని కోణాల్లో పరిశీలించాకే గ్రేటర్‌లో బస్సులను అప్పగించనున్నారు. డ్రైవర్ల ఎంపికపై గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా రవాణాశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. బడి సెలవులు ముగిసి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండటానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

3729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles