అధిక లాభాలంటూ మోసం..

Wed,June 5, 2019 06:50 AM

ALLURI OVERSEAS PRIVATE LIMITED MD Vikramaditya arrested by CCS Police

మహిళ ఆస్తిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి రుణం
తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిన ఓ సంస్థ ఎండీ అరెస్ట్


హైదరాబాద్ : తాను ప్రారంభించే వ్యాపారంలో భారీ లాభాలుంటాయని నమ్మించి, ఒక మహిళ ఆస్తిని బ్యాంకుకు తాకట్టుపెట్టి రుణం పొంది మోసం చేసిన ఒక ప్రైవేట్ సంస్థ నిర్వాహకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. విక్రమాదిత్య అల్లూరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతూ ఏపీఎస్‌ఎఫ్‌సీ నుంచి అల్లూరి కాసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై రుణాలు తీసుకున్నాడు. తన వద్ద ఉన్న ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణాలు పొందడంతో భారీగా అప్పులు పెరిగిపోయి, దివాలా తీశాడు.

దీంతో అల్లూరి ఓవర్‌సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మరో కొత్త కంపెనీని ప్రారంభించాడు. తాను కొత్త కంపెనీని ప్రారంభించానని తన తండ్రి భూపాల్‌రెడ్డి ఇతర మధ్యవర్తుల ద్వారా దివ్య అనే ఒక మహిళను సంప్రదించారు. తాను కొత్తగా కంపెనీ పెట్టి ఆధునిక పద్ధతిలో ప్యాకింగ్ బాక్స్‌లు తయారు చేస్తున్నానని, దానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండడంతో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. అయితే తాను బ్యాంకు నుంచి రుణం పొందేందుకు సెక్యూరిటీగా మీ వద్ద ఉన్న ఆస్తిని ఇవ్వాలని కోరాడు. దీనికి సదరు మహిళ అంగీకరించడంతో, కంపెనీలో డైరెక్టర్‌గా ఆమెను నియమించాడు.

నాచారంలోని దివ్యకు సంబంధించిన ఆస్తిని కాచిగూడ ఆంధ్రాబ్యాంకులో సెక్యూరిటీగా పెట్టి రూ. 4.5 కోట్ల రుణం పొందాడు. బ్యాంకు నుంచి రూ. 2.34 కోట్లు మొదటి దఫాగా విడుదలయ్యాయి. ఇలా వచ్చిన డబ్బుతో విక్రమాదిత్య అప్పులను తీర్చుకున్నాడు. ఆ తరువాత బ్యాంకుకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు విక్రమాదిత్యను అరెస్ట్ చేశారు.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles