నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణపయ్య

Sun,September 23, 2018 12:47 PM

Aiming to complete the  Khairatabad Ganesh immersion procession by 1 pm

హైద‌రాబాద్: తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ స‌ప్త‌ముఖ కాల‌స‌ర్ప గణనాథుని శోభయాత్ర క్రేన్‌ నంబర్‌ 6వద్ద చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య భారీ గణపతిని నెమ్మదిగా హుస్సేన్‌సాగర్ కు చేర్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌ రెడ్డి, త‌దిత‌రులు భారీ గణపతి వద్దకు వచ్చారు. ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించిన అనంతరం గణేషుని నిమజ్జనం చేస్తారు. నగర పోలీసులు లక్ష్యంగా విధించుకుని ఖైరతాబాద్‌ భారీ గణపతిని త్వరగా నిమజ్జనం చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. మహా గణపతిని మధ్యాహ్నం 2 గంట‌ల లోపే నిమజ్జనం చేసి ఇతర గణపతి ఊరేగింపులకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. నిమ‌జ్జ‌నం కోసం 400 ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన ప్ర‌త్యేక క్రేన్ ను అధికారులు ఏర్పాటు చేశారు.

2430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS