నేడు ప్రోటెం స్పీకర్ ప్రమాణం

Wed,January 16, 2019 07:34 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రోటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సాయంత్రం 5 గంటలకు చార్మినార్ స్థానం నుంచి గెలిచిన అహ్మద్‌ఖాన్‌తో ప్రమాణం చేయించనున్నారు. ప్రోటెం స్పీకర్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన గురువారం 11.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి రేపు స్పీకర్ ఎన్నికకు షెడ్యూల్ ప్రకటన.. జనవరి 18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.


అలాగే ఈనెల 19న ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం ప్రారంభమవుతుంది. ఈనెల 19న ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.

3251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles