ఇంటి వద్దనే ఆధార్ నమోదుWed,September 13, 2017 07:10 AM
ఇంటి వద్దనే ఆధార్ నమోదు  • వృద్ధులు, వికలాంగుల కోసం ఆధార్ ఆన్ వీల్స్ షురూ

హైద‌రాబాద్: ఆధార్ సెంటర్లకు రాలేని జంటనగరాల్లోని వృద్ధులు, వికలాంగులు మొబైల్ ఆధార్ సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. ప్రశాంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆధార్ ఆన్ వీల్స్ వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగులతో పాటు దీర్ఘకాలంగా మంచానికే పరిమితమై ఆధార్ నమోదు కేంద్రాలకు రాలేని వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించిందని జేసీ వివరించారు. ఇంటివద్దనే ఆధార్ నమోదు చేయించుకోవాలనుకునేవారు 040-2311 9266 నంబర్‌కు కాల్ చేయవచ్చని, ఆదే విధంగా roh.help@ uidai.net.inలో మెయిల్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సతీష్ చంద్ర, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ రజిత, కో-ఆర్డినేటర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

5030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS