అత్తింటి వారి వేధింపులకు నవవధువు ఆత్మహత్య

Wed,June 5, 2019 06:45 AM

a woman suicide in hyderabad

హైదరాబాద్ : అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. బన్సీలాల్‌పేట్ బోయిగూడలో నివాసం ఉండే శాంతిలాల్, మీనాలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మహావీర్ మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీతా రాధోడ్(30)ను రెండు నెలల క్రితం ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత పుట్టింటికి వెళ్లిన సంగీత గత నెల 25న నగరంలోని అత్తగారింటికి భర్తతో కలిసి వచ్చింది. అయితే కోడలు వచ్చినప్పటి నుంచి మహావీర్ తల్లి మీనా, తండ్రి శాంతిలాల్ వేరే వారి ఇంట్లో ఉంటున్నారు. సంగీతకు అత్తమామల వేధింపులు అధికమయ్యాయి.

ఇదిలా ఉండగా.. ఆదివారం అర్ధరాత్రి భారార్యభర్తలు పడుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు మహావీర్ నిద్రలేచి చూసే సరికి భార్య కనిపించలేదు. పక్క గది తలుపులు పెట్టి ఉండగా స్థానికులు సహాయంతో పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మంగళవారం సాయంత్రం సంగీతా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

4857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles