మద్యం మత్తులో టవరెక్కిన కారు డ్రైవర్..

Mon,November 11, 2019 06:41 AM

హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ మలక్‌పేట టీవీ టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. టవర్‌పైకి ఎక్కిన వ్యక్తి పైనుంచి మొబైల్ ఫోన్‌తో లైట్ కొట్టడం, జేబుల్లో వెంట తీసుకెళ్లిన రాళ్లను విసురుతూ అందరికీ ముచ్చెమటలు పట్టించాడు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామానికి చెందిన ఎం.గంగాధర్‌గౌడ్ (37) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ మలక్‌పేట ఆస్మానఘడ్‌లోని వెంకటాద్రినగర్‌లో నివాసముంటున్నాడు.


ఆదివారం సాయంత్రం 7గంటల సమయంలో మద్యం మత్తులో మలక్‌పేట టీవీ టవర్ వెనుక వైపునున్న ప్రహరీ నుంచి లోనికి వెళ్లి టీవీ టవర్‌పైకి ఎక్కాడు. పైనుంచి రాళ్లు రువ్వుతూ సెల్‌ఫోన్ లైట్ కొట్టడంతో గమనించిన స్థానికులు మలక్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయించి టవర్‌పైన వ్యక్తి ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా కిందికి దింపేందుకు చర్యలు తీసుకున్నారు.

ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగే అయి ఉంటాడని భావించిన కొందరు వదంతులు సృష్టించడంతో ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. అగ్నిమాపక శాఖ, టాస్క్‌ఫోర్స్, జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ టీంలు, 108 సిబ్బంని రప్పించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఈస్ట్‌జోన్ అదనపు డీసీపీ గోవింద్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు, డీఐ నాను నాయక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. చీకట్లో రెండు గంటలపాటు అందరికీ ముచ్చెమటలు పట్టించిన దుండగుడు, చివరకు పదిఫీట్ల ఎత్తులోకి రాగానే పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా గట్టిగా పట్టుకున్న పోలీసు సిబ్బంది క్షేమంగా కిందికి దింపి 108 వాహనంలో దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles