మేడ్చల్‌లో వివాహిత అదృశ్యం

Mon,November 11, 2019 06:31 AM

మేడ్చల్ : తల్లిగారింటికని వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన సాయిలు, గంగా(22) దంపతులు మేడ్చల్‌లోని కిందిబస్తీలో ఏడాదిగా నివాసముంటున్నారు. ఈనెల 9న ఉదయం భర్త పనికి వెళ్లగా భార్య తల్లిగారింటికి వెళుతున్నానని పక్కింటి వారికి చెప్పి తాళం వేసి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె కనిపించకపోవడంతో విషయం తెలుసుకుని ఆమె సెల్‌కు ఫోన్‌కు కాల్ చేయగా, స్విచ్ఛాప్‌లో ఉన్నది. ఆమె తల్లికి ఫోన్ చేయగా, అక్కడికీ వెళ్లలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఆదివారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.

1570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles