కొంప ముంచిన సెల్‌ఫోన్, రాంగ్‌రూట్ డ్రైవింగ్.. వీడియో

Wed,July 11, 2018 11:26 AM

a man drive cell phone talking while wrong root in hyderabad

హైదరాబాద్ : సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్ అతి ప్రమాదకరం అని హెచ్చరించినా కూడా అసలు వినిపించుకోరు వాహనదారులు. ఓ వాహనదారుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. రాంగ్‌రూట్‌లో డ్రైవ్ చేయగా.. మరో బైక్‌ను ఢీకొట్టాడు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా.. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన బహదూర్ పురా నాలా వద్ద జులై 9న చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


4640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles