సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ మోసం

Tue,April 30, 2019 07:04 AM

a man cheating in film industry and take 2 lakhs

హైదరాబాద్ : హీరో నాని నటించే సినిమాలో సపోర్టింగ్ పాత్రలో వేషం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని మొహం చాటేసిన ఓ వ్యక్తిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండల, చిట్యాల గ్రామానికి చెందిన ప్రభాకర్ కోసూరి ముంబాయిలో పనిచేస్తున్నాడు. సిమాల్లో నటించాలనే కోరిక ఉన్న ప్రభాకర్ రెండు సంవత్సరాల కిందట నగరంలో క్లిక్ సినీ క్రాఫ్ట్ సంస్థను సంప్రదించాడు. అక్కడ కొత్తపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నాని హీరోగా నటించే సినిమా తీస్తున్నామని, అందులో సపోర్టింగ్ క్యారెక్టర్‌ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే పూచీకత్తుగా కొంత నగదు చెల్లించాలని చెప్పడంతో శ్రీనివాస్ రూ.2,22,000లు ఇచ్చాడు. కాగా సినిమాలో వేషం ఇప్పించకుండా మొహం చాటేసి తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితుడు ప్రభాకర్ గత ఆరు నెలల కిందట ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించగా డబ్బు తిరిగి చెల్లిస్తానని శ్రీనివాస్ చెప్పాడు. అయినా డబ్బు ఇవ్వకపోవడంతో తాజాగా ప్రభాకర్ ఎస్సార్ నగర్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్ల్లు పోలీసులు తెలిపారు.

1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles