తాగి భార్యతో గొడవపడి.. ఆత్మహత్యాయత్నం

Thu,September 13, 2018 07:38 AM

a drunken husband fight with wife after suicide attempt

హైదరాబాద్ : తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి.. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం... సుందర్‌నగర్ ప్రాంతానికి చెందిన మహబూబ్ మియాన్ కుమారుడు మహమూద్ మియాన్(50) కూరగాయలు విక్రయిస్తుంటాడు. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతుండేవాడు. మంగళవారం రాత్రి కూడా మద్యం సేవించి, భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మహమూద్ మియాన్‌ను ఉస్మానియా దవాఖానకు తరలించారు. 50 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధర్మ తెలిపారు.

2436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS