బాలిక గర్భవతి.. ముఖం చాటేసిన యువకుడు

Tue,July 16, 2019 07:18 AM

a 20 years old boy cheated a 16 years old girl in the name of love

హైదరాబాద్ : మాయమాటలతో మైనర్‌బాలికను సంవత్సరకాలంగా లైంగికంగా లోబర్చుకున్న ఓ ప్రబుద్ధుడు.. బాలిక గర్భం దాల్చిన అనంతరం మొహం చాటేశాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన హరీశ్(20) జులాయిగా తిరుగుతాడు.

అయితే దీనబంధుకాలనీకి చెందిన ఓ బాలిక(16)కు మాయమాటలు చెప్పి సంవత్సర కాలంగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో మొహం చాటేసి వెళ్లిపోయాడు. విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా గత నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

1763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles