బ్లాక్‌లో ఐపీఎల్ టిక్కెట్ల విక్రయం.. 93 మంది అరెస్ట్

Tue,May 14, 2019 06:27 AM

93 membres arrested by Uppal Police after IPL tickets sale in black market

హైదరాబాద్ : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం ప్రాంతాల్లో బ్లాక్ టిక్కెట్లు విక్రయిస్తున్న వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు వివిధ మ్యాచ్‌ల సందర్భంగా బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న 93 మందిని అదుపులోకి తీసుకున్నట్లు, వారి నుంచి రూ.2,10,140 నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఉప్పల్‌లో జరిగిన ఎనిమిది మ్యాచ్‌లలో మార్చి 29న 16 మంది నుంచి 48 టిక్కెట్లు, మార్చి 31న ముప్పై మంది నుంచి 122 టికెట్లు, ఏప్రిల్ 6న తొమ్మిది మంది నుంచి 32, ఏప్రిల్ 14న ఎనిమిది మంది నుంచి 23, ఏప్రిల్ 17న ఇద్దరి నుంచి మూడు టిక్కెట్ల్లు, ఏప్రిల్ 21న తొమ్మిది మంది నుంచి 21 టిక్కెట్లు, ఏప్రిల్ 29న ఐదు మంది నుంచి 12 టిక్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

అదేవిధంగా మే 12న జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 14 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 43 టిక్కెట్ల్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బ్లాక్ టిక్కెట్ల విక్రయాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేసి, ప్రశాంతంగా క్రీడలు ముగిసేలా కృషిచేసినట్లు పోలీసులు తెలిపారు.

938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles