గజం రూ.28వేలు.. పలికింది రూ.51,516

Tue,April 9, 2019 07:08 AM

67 plots at Uppal Bhagayat   e-auctioned

హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రియల్ సత్తాను చాటింది. రెండు రోజుల ప్లాట్ల ఈ వేలం ద్వారా ఏకంగా రూ. 677కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఉప్పల్ భగాయత్ లే అవుట్ ఫేజ్-2లోని మల్టీజోన్ ప్లాట్ల ఈ వేలం 7,8వ తేదీల్లో నిర్వహించారు. తొలి రోజు ఆదివారం 36 ప్లాట్లకు (495 గజాల నుంచి 1546 విస్తీర్ణం గల ప్లాట్ల)కు వేలం నిర్వహించగా అత్యధికంగా 73, 900లకు, అత్యల్పంగా రూ. 57వేలకు దక్కించుకుని ఒక్కరోజూ రూ.202 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.

రెండో రోజూ ఆదివారం 31 ప్లాట్ల (విస్తీర్ణం 1500 నుంచి 8వేల గజాల స్థలం) ఈ వేలం నిర్వహించారు. ఇందులో అత్యధికంగా చదరపు గజానికి రూ. 59, 8000లు పలుకగా, అతి తక్కువగా రూ. 36,600లతో కొనుగోలుదారులు దక్కించుకున్నారు. రెండు విడుతల్లో జరిగిన ఈ వేలం ద్వారా ఒక్కరోజే రూ. 474 కోట్ల ఆదాయాన్ని హెచ్‌ఎండీఏ సమకూర్చుకున్నది. మొత్తం ఈ వేలం ప్రక్రియలో సగటున గజం రూ. 51,516 ధర పలకడం గమనార్హం. హెచ్‌ఎండీఏ కనీస ధర గజానికి రూ.28వేలుగా నిర్ణయించింది.

6002
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles