ఉమెన్స్ డే సందర్భంగా 5కే, 2కే రన్‌లు: సీపీ

Fri,February 17, 2017 06:27 PM

5K and 2K Run on Women's day

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 5వ తేదీన 5కే, 2కే రన్‌లు నిర్వహించనున్నట్లు నగర సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. రన్‌లో 7 వేల మందికి పైగా పాల్గొనేలా యువతను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ సేఫ్‌సిటీ, మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. 4వ తేదీన పీపుల్స్ ప్లాజాలో మహిళా భద్రత, క్రైమ్, సేఫ్‌సిటీపై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళ భద్రతపై ఎస్‌ఏ రైటింగ్, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫి, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా డిజిటల్ సెఫ్టీపై మహిళలు, చిన్నారులకు అవగాహన కల్పిస్తామన్నారు. హాకా భవన్‌లోని భరోసా సెంటర్ లేదా ఆన్‌లైన్‌లో www.sheforchange.com ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

1020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS