మార్చి 5న షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్

Sat,February 18, 2017 12:34 AM

5K and 2K run by SHE TEAMS

మహిళల భద్రతకు భరోసా
పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభం
ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు
పోస్టర్‌ను విడుదల చేసిన సిటీ పోలీస్ కమిషనర్


హైదరాబాద్ : హైదరాబాద్‌ను క్రైమ్ ఫ్రీగా మార్చడంతో పాటు మహిళల భద్రతకు పూర్తి భరోసా ఉందని చాటి చెప్పడంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీటీ మ్స్ ఆధ్వర్యంలో మార్చి 5న మహిళలు, ప్లిలలు, మహిళలకు సంబంధించిన సైబర్ నేరాలపై అవగాహన తెచ్చేందుకు 5కే, 2కే రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఈ రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను, రన్‌లో పాల్గొనే వారు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్‌పేజీని ఆయన ప్రారంభించారు. ఈ రన్‌లో నగర వ్యాప్తంగా 7 వేల మంది పా ల్గొనే అవకాశాలున్నాయన్నారు. డిజిటల్ యుగంలో సైబర్‌నేరాలు కూడా జరుగుతున్నాయని, మహిళలకు సైబర్ నేరాలతో ఎలాంటి అనర్ధాలు కల్గుతాయి, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మార్చి 4న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఉమెన్ ఎక్స్‌ఫో ప్రారంభమవుతుందని, మరుసటి రోజు 5కే, 2కే రన్, ప్రమ్ వాక్(చైల్డ్) ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఇందులో మహిళల భద్రత, సైబర్ నేరాలు తదితర అంశాలపై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ లు కూడా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తాయన్నారు. రెండేళ్లుగా షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయని అన్నారు.

హైదరాబాద్‌ను సేఫ్ అండ్ సెక్యూరిటీ సిటీ మార్చేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం పనితీరు చాలబాగుందన్నారు. ఈ రన్‌లో పాల్గొనే వారు www.sheforchange.com లో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మార్చి 5 వరకు నిరంతరం ప్రజలకు తెలియజేసేందుకు రోడ్డు షో, ఎల్‌ఈడీ వ్యాన్స్, సినిమా థియేటర్స్, బస్‌లపై పోస్టర్లు, బస్‌స్టాప్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

వివిధ అంశాలపై పోటీలు
ఈ సందర్భంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీడియో గ్రఫీ(షార్ట్ ఫిలిమ్స్), ఫొటోగ్రఫీ, పెయింటింగ్, మహిళల భద్రత, సైబర్ క్రైమ్, పిల్లలపై వేధింపులకు సంబంధించిన అంశాలపై కవితలతో కూడిన వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనే వారు ఫిబ్రవరి 28వ తేదీ వరకు హాకా భవన్‌లోని భరోసా కేంద్రంలో తమ పేర్లను నమోదు చే యించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇన్‌చార్జి స్వాతిలక్రా, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, అదనపు డీసీపీ రంజన్ రతన్‌కుమార్, ఏసీపీ కవిత పాల్గొన్నారు.

1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS