మెట్రోరైలు ట్రాక్ దాటితే 500 జరిమానా లేదా జైలుశిక్ష

Thu,October 25, 2018 06:56 AM

500 rupees fine or imprisonment for crossing metro rail track

హైదరాబాద్: ఒక పక్కనున్న ప్లాట్‌ఫాం నుంచి అవతలి పక్కనున్న ప్లాట్‌ఫాం మీదకు చేరడానికి కొంతమంది ట్రాక్‌దాటుతున్నారని, ఇది నేరమని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హెచ్చరించారు. నేరానికి రూ.500 జరిమానా లేదా ఆరు నెలలపాటు కఠినమైన జైలుశిక్ష ఉంటుందని తెలిపారు. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మెట్రోరైళ్లు అధిక వేగంతో పనిచేస్తున్నాయని, రైళ్ల వేగంతో పాటు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్ దాటడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. స్టేషన్ దాటాలనుకున్నవారెవ్వరైనా లిఫ్ట్, ఎస్కలేటర్, మెట్ల మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.

2510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles