భర్తతో గొడవపడి గృహిణి ఆత్మహత్య

Sat,April 6, 2019 06:32 AM

25 year old woman suicide in Hyderabad

హైదరాబాద్ : భర్తతో తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగి పోయిన భార్య ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయనగర్‌లో నివసించే సతీశ్(35)కు జాఫర్‌గూడకు చెందిన ప్రియాంక(25)తో ఎనిమిదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సతీశ్ పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా, పెండ్లి అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆరు నెలల క్రితం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ప్రియాంక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించి వేశారు. మూడు నెలలు మంచిగా చూసుకున్న సతీశ్ తిరిగి భార్యను వేధించాడు. వేధింపులు అధికం కావడంతో ప్రియాంక గురువారం ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసును ఎస్‌ఐ బుర్హన్ దర్యాప్తు చేస్తున్నారు.

1660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles