ఖైరతాబాద్ వినాయకుడికి భారీ శాలువా

Tue,September 11, 2018 08:23 AM

20m length  Shalva for khairatabad ganesh


భూదాన్‌ పోచంపల్లి: ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించనున్న మహా గణపతికి ఈసారి కూడా చేనేత కార్మికులు భారీ శాలువాను సిద్ధం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామంలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు చేనేత కార్మికులు 25 మీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పుతో చేనేత మగ్గంపై శాలువాను తయారు చేశారు. కాషాయం రంగులో ఉన్న ఈ శాలువాలో మహాగణపతి, ఉండ్రాలు, లడ్డూలు, మహాశివుడు, శంకు చక్రాలు, ఓం, ధనస్సు, కాలసర్పం ఆకారాలు ఉండేలా మగ్గంపై ఎంతో అందంగా నేశారు.

చేనేత మగ్గంపై ఈ శాలువాను నేయడానికి సుమారు నెలరోజులు పట్టినట్టు పార్కు చైర్మన్ కడవేరు దేవేందర్, డైరెక్టర్ భారత లవకుమార్ తెలిపారు. ఈ శాలువాను పార్కులోని కర్నాటి విష్ణు అనే చేనేత కార్మికుడు రూపొందించారు. దీన్ని వినాయకచవితి రోజు ఖైరతాబాద్ గణపయ్యకు సమర్పించనున్నట్టు వారు పేర్కొన్నారు.

1931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles