కొల్లూరులో మెగా డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం

Wed,July 11, 2018 09:44 PM

15660 double bed room houses to be build in ghmc region

-రూ.1354.59 కోట్లతో 15,660 ఇండ్ల నిర్మాణం
హైదరాబాద్: ఒకే చోట 15,600 డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం ద్వారా చరిత్ర సృష్టిస్తున్నది జీహెచ్ఎంసీ. చిన్న‌పాటి న‌గ‌రాన్ని రూపొందించే ఈ మెగా డ‌బుల్ బెడ్‌రూం సిటీ నిర్మాణాన్ని రామ‌చంద్ర‌పురంలోని కొల్లూరు గ్రామంలో నిర్మిస్తోంది. మొత్తం నిరుపేద ల‌బ్దిదారులకు ఉచితంగా నిర్మించ‌నున్న ఈ డిగ్నిటీ హౌజింగ్‌ను కొల్లూరులో 124 ఎక‌రాల స్థ‌లంలో రూ.1354.59 కోట్ల వ్య‌యంతో 15,660 ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతున్నారు. మొత్తం 117 హౌజింగ్ బ్లాకుల్లో ఎస్-9, ఎస్‌+10, ఎస్‌+11 అంత‌స్థుల్లో నిర్మిస్తున్న ఈ కాల‌నీని దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైనదిగా, మ‌రెక్క‌డా లేనివిధంగా అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మిస్తుండటంతో మోడ‌ల్ సిటీగా మార‌నుంది.

కొల్లూరు మెగా డ‌బుల్ బెడ్‌రూం కాల‌నీ విశేషాలు* శెర్ వాన్ టెక్నాలజీతో నిర్మాణం..

* ఒక్కో ఇల్లు 580 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో..

* ఒక్కో ఇంటికి రూ.7.90 ల‌క్ష‌ల వ్య‌యం. మ‌రో 75 వేల రూపాయ‌ల‌తో మౌలిక సదుపాయ‌ల క‌ల్ప‌న‌..

కొల్లూరు డ‌బుల్ బెడ్‌రూం కాల‌నీలో సౌక‌ర్యాలు* అంత‌ర్గ‌త సి.సి రోడ్లు, స్టార్మ్ వాట‌ర్ డ్రైయిన్లు.

* మంచినీటి స‌ర‌ఫ‌రా

* అంత‌ర్గ‌త డ్రైనేజీతో పాటు సీవ‌రేజ్ ప్లాంటు (ఎస్‌.టి.పి) నిర్మాణం.

* వీధి విద్యుత్ దీపాలు.

* ఘ‌న వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ ఏర్పాటు.

* క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ నిర్మాణం.

* క‌మ్యునిటీ కాంప్లెక్స్‌

* పాఠ‌శాల, అంగ‌న్‌వాడి కేంద్రాల ఏర్పాటు

* బ‌స్టాప్‌, పోలీస్ స్టేష‌న్‌, ఫైర్ స్టేష‌న్‌, పెట్రోల్ బంక్ నిర్మాణం.

* వివిధ మ‌తాల ప్రార్థ‌నా కేంద్రాల ఏర్పాటు.

* షియ‌ల్ వాల్ సాంకేతిక ప‌ద్ధతిలో నిర్మాణం.

* మొత్తం 15,660 డ‌బుల్ బెడ్ రూమ్‌లు క‌లిపి 96,75,100 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం.

* నిర్మాణం 15 నెల‌ల్లో పూర్తి చేయాల‌నే ల‌క్ష్యం.

* ప్ర‌తి బ్లాకుకు రెండు మెట్ల దారి. ప్ర‌తి మెట్ల దారి 3 మీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మాణం.

* ప్ర‌తి బ్లాకుకు 8మందిని తీసుకెళ్లే కెపాసిటి క‌లిగిన రెండు లిఫ్టుల ఏర్పాటు.

2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles