వినాయక చవితి.. 14 వేల మంది పోలీసులతో బందోబస్తు

Thu,September 13, 2018 07:45 AM

14 thousand police security for Vinayaka Chavithi

హైదరాబాద్ : వినాయక నవ రాత్రులకు హైదరాబాద్‌లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ప్రశాంతమైన వాతావారణంలో భక్తి శ్రద్దలతో వినాయక నవరాత్రులు పూర్తి చేసుకోవాలని నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, 14 వేల మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 8 వేల గణేష్ మండపాలు సిటీ పోలీస్ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఇంకా రిజిస్ట్రేషన్ అవుతున్నాయన్నారు. ఈ సారి మరింత టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. మండపాలకు క్యూఆర్ కోఢ్‌ను ఏర్పాటు చేశా మని, దీని ద్వారానే నిమజ్జనాన్ని వేగవంతం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామ న్నారు. గణేష్ మండపాల ఏర్పాటు నుంచి, నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రభుత్వంలోని అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముం దుకు వెళ్తున్నామన్నారు. నిమజ్జనం రోజు బాలా పూర్ నుంచి ప్రారంభమయ్యే బాలాపూర్ వినా యక నిమజ్జన రూట్‌కు సంబంధించి 18 కిలో మీటర్లలో 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

1523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles